సినిమా పాటల రచయిత చంద్రబోస్‌ సోదరుడు కన్నుమూత.. రోడ్డుపై కుప్పకూలి!

2 months ago 17
Lyricist Chandrabose Brother Rajendar Passed Away: సినిమా పాటల రచయిత చంద్రబోస్ సోదరుడు చనిపోయారు. రాజేందర్ వ్యాపార పనుల కోసం బెంగళూరు వెళ్లారు.. అక్కడి నుంచి బయల్దేరి అన్నమయ్య జిల్లా కలికిరిలో తన స్నేహితుడు శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లారు. శనివారం రాత్రి అక్కడే బస చేయగా.. ఆదివారం ఉదయం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి రాజేందర్ కలికిరి క్రాస్ రోడ్‌కు వచ్చారు.. అక్కడ హోటల్‌లో టిఫిన్ కూడా చేశారు. ఇంతలో మరోసారి గుండెపోటు రావడంతో అక్కడే రోడ్డుపై కుప్పకూలి చనిపోయారు.
Read Entire Article