సింగరేణి వ్యాఖ్యల రగడ.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్

5 days ago 4
బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద శనివారం ఉదయం నుంచి జరిగిన తీవ్ర హైడ్రామా, ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని నాంపల్లికి తరలించారు. ఇటీవల సింగరేణి సంస్థ, అక్కడి వారసత్వ ఉద్యోగాలు, కుంభకోణాలపై బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. ప్రభుత్వ వైఫల్యాలను, హామీలను ప్రశ్నిస్తున్నందుకే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్ కలిసి కుట్రపూరితంగా తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అరెస్టుకు ముందు సుమన్ మండిపడ్డారు.
Read Entire Article