భర్తతో దూరంగా ఉంటున్న మహిళకు దగ్గరై.. ఆమె న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేసి ఓ యువకుడు వైరల్ చేసిన ఘటన హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. శంషాబాద్ ప్రాంతంలో కేటరింగ్ వర్కర్‌గా పనిచేస్తున్న ఓ మహిళకు.. ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే యువకుడు పరిచయమయ్యాడు. ఈ పరిచయం సాన్నిహిత్యంగా మారగా.. ఇటీవల బలవంతంగా ఆమెతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించుకున్నాడు. ఈ వీడియోలను రికార్డు చేసి తన భర్త, సోదరితో పాటుగా పలువురికి షేర్ చేసినట్లు ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.