రెయిన్ అలర్ట్.. మరో ఐదు రోజులు వర్షాలు.. అక్కడ మాత్రం భారీ వానలు

11 months ago 19
గత రెండు వారాలుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వానలకు రెండు రోజుల నుంచి కాస్త బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గినట్టే అనిపించినా, వాతావరణ శాఖ మాత్రం మరో ఐదు రోజులు వానలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. నేడు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, ఆకాశం మేఘావృతమై ఉంటుందని సమాచారం. మరి ఈ వానలు ఎప్పుడు పూర్తిగా తగ్గుతాయో చూడాలి.
Read Entire Article