రూ.వేల కోట్లతో అద్భుత పథకం.. ఈ కొత్త పథకానికి మంచిపేరు సూచించాలి: సీఎం రేవంత్

1 week ago 4
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వచ్చే ఏడాది జులై వరకు కరవు పరిస్థితులు కొనసాగే ప్రమాదం ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. సంక్రాంతి తర్వాత నాలుగు నెలల పాటు ప్రజాప్రతినిధులు గ్రామాల్లోనే ఉండేలా వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకం తీసుకురానున్నట్లు తెలిపారు. వ్యవసాయ పొలాలకు రహదారులు, చెరువులు, కుంటలు, కాల్వల పునరుద్ధరణతో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. భూగర్భ జలాల కొరత దృష్ట్యా ఆరుతడి పంటలు, కూరగాయల సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. పంటలు వేయలేని కుటుంబాలకూ పని కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Read Entire Article