రూ.50 లక్షలు ఇవ్వకపోతే ఇంటిని పేల్చేస్తాం.. మాజీ MLA కుటుంబానికి నక్సల్స్ పేరుతో బెదిరింపులు

1 year ago 27
మేడ్చల్ జిల్లా షాపూర్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుడి కుటుంబాన్ని బెదిరిస్తూ మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ కలకలం రేపింది. రూ.50 లక్షలు ఇవ్వకపోతే శ్రీశైలం గౌడ తమ్ముని కుమారుడు కూన రాఘవేందర్‌గౌడ్‌ను చంపుతామని, ఇళ్లను పేల్చేస్తామని లేఖలో హెచ్చరించారు. ఈ నెల 21న ఈ ఘటన జరగ్గా.. రాఘవేందర్‌గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టుల ప్రమేయంపై పోలీసులు విచారిస్తున్నారు.
Read Entire Article