రూ.1,090 కోట్లతో కొత్త స్టీల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణం..బంజారాహిల్స్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి తొలగింపు..?

1 week ago 11
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ముఫఖం ఝా కాలేజీ సమీపంలోని ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.1,090 కోట్లతో నిర్మించనున్న ఆరు వరుసల స్టీల్‌ ఫ్లైఓవర్‌ కోసం ఈ బ్రిడ్జిని తొలగించే అవకాశముంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి కాలేజీ వరకు నిర్మించే ఫ్లైఓవర్‌కు అనుసంధానంగా రోడ్‌ నంబర్‌ 1కు ర్యాంపును కూడా ప్రతిపాదించారు. పిల్లర్లు, బీముల నిర్మాణం తర్వాత వంతెనను తొలగించవచ్చని జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి. గతంలో విద్యార్థుల ఆందోళనల వల్ల నిర్మించిన ఈ వంతెన తొలగింపుతో పాదచారుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read Entire Article