హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి వేళ ఒంటరిగా చిక్కుకుపోయిన ఓ యువతి పట్ల పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ట్రైన్ ఆలస్యం కావడంతో అర్ధరాత్రి 1:45 గంటలకు లింగపల్లి స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలు భయంతో పోలీసులను ఆశ్రయించగా.. వారు బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చినట్లు ఆమె ఓ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.