యాదగిరిగుట్టలో మరో విషాదం.. పుష్కరిణిలో మునిగి 4 ఏళ్ల చిన్నారి మృతి

1 week ago 13
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన 4 ఏళ్ల చిన్నారి పుష్కరిణిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్‌కు చెందిన దంపతులు తమ పిల్లలతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లగా.. కల్యాణకట్ట సమీపంలోని పుష్కరిణి వద్ద కుటుంబ సభ్యులు స్నానం చేస్తుండగా చిన్నారి మెట్ల వద్ద ఆడుకుంటూ నీటిలో పడిపోయింది. వెంటనే ఆమెను బయటకు తీసి ఎయిమ్స్ బీబీనగర్‌కు తరలించినా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. యాదగిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Entire Article