మీ వాహనం పోయిందా, టెన్షన్ పడకండి.. టీజీ ఈ-టికెట్ యాప్‌తో దొంగలను పట్టుకుంటున్న పోలీసులు

1 month ago 10
మీ బండి, కారు చోరీకి గురైతే ఇక దాన్ని పట్టుకోవడం సులువే. పోయిన వాహనం ఆచూకీ కోసం రోజులు, నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా తెలంగాణ పోలీసులు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. చోరీకి గురైన వాహనాలను వేగంగా గుర్తించేందుకు టీజీ ఈ-టికెట్‌ యాప్‌ను తీసుకొచ్చారు. వాహనం పోయినట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే.. ఆ వివరాలను డేటాబేస్‌లో నమోదు చేస్తారు. ఆ యాప్‌ ద్వారా తనిఖీల సమయంలో చోరీకి గురైన వాహనాన్ని గుర్తించేలా వ్యవస్థను రూపొందించారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 90కిపైగా చోరీ వాహనాలను గుర్తించారు.
Read Entire Article