తిరుమల శ్రీవారి అన్నప్రసాదాన్ని మరింత నాణ్యంగా, రుచికరంగా భక్తులకు అందించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తిరుమలకు ముడి సరుకులు సరఫరా చేసే రైస్, దాల్ మిల్లర్లతో టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముడిసరుకుల నాణ్యతలో రాజీకి తావులేదని స్పష్టం చేశారు. ఎంపానల్ వ్యవస్థ ద్వారా ముడిసరుకుల కొనుగోలులో పారదర్శకత పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.