మణికొండలో అగ్నిప్రమాదం.. 19 అంతస్తుల BRC అపార్ట్‌మెంట్‌లో మంటలు

9 months ago 19
Fire Accident: హైదరాబాద్‌లోని మణికొండలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 19 అంతస్తుల బీఆర్‌సీ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం మధ్యాహ్నం విద్యుత్ వైర్ల డక్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. మంటలు విస్తరించడంతో నివాసులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Entire Article