ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అయితే కొన్ని కౌంటింగ్ సెంటర్లలో అనూహ్య ఘటనలు చోటుచేసుకున్నాయి. దాంతో ఓట్ల లెక్కింపు సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల ఓటర్లు చేసిన పనికి అధికారులు విస్తుపోయారు. కొన్ని చోట్ల ఏ పార్టీకి వేయకుండా.. తప్పుగా ఓట్లు వేస్తే.. మరికొన్నిచోట్ల చెల్లిన ఓట్లు కేవలం రెండు మాత్రమే. వాటినే అధికారులు లెక్కలోకి తీసుకున్నారు. ఇక పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఘటన ఇంకా అనూహ్యంగా ఉంది. బ్యాలెట్ బాక్స్‌ని కంప్లైంట్ బాక్స్‌గా మార్చేశారు. మొత్తానికి ఓటర్లు ఈసారి మామూలు ట్విస్ట్‌లు ఇవ్వలేదు.