వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. మంత్రి నారా లోకేష్ కొత్త పేరు పెట్టారు. శుక్రవారం కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఓ సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన లోకేష్.. జగన్ మీద విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే జగన్‌కు తాను బెంతాహై అంటూ మంచి పేరు పెడుతున్నానని సెటైర్ వేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.