బిగ్ షాక్.. తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్.. కారణం ఇదే..

7 months ago 21
తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి స్థానిక ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా విరామం పడింది. ఇప్పటివరకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న కోటి చీరల్లో దాదాపు 44 లక్షలను పంపిణీ చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. పట్టణ ప్రాంతాల్లోని మహిళా లబ్ధిదారులకు మాత్రం మార్చి 1వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ చీరలను పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో తొలి విడత డిసెంబర్ 11న జరగనుంది.
Read Entire Article