పోలీస్ శాఖలో అన్ని ఖాళీలు భర్తీ..అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం ప్రకటన

2 weeks ago 8
పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది త్యాగాలను స్మరించుకున్నారు. అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 4,773 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడించారు. పోలీస్ శాఖలోని మిగిలిన ఖాళీలను దశలవారీగా భర్తీ చేసి.. 2028 నాటికి అన్ని పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
Read Entire Article