ఆర్టీసీ బస్సులో ‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’ అని రాసి ఉన్నట్లు కనిపించే ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో సూర్యాపేట రూట్ బస్సులో తీసిందిగా ప్రచారం జరుగుతుండగా.. దీనిపై నెటిజన్లు సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ బోర్డు నిజమైనదా లేదా ఏఐ, డిజిటల్ ఎడిటింగ్‌తో రూపొందించారా అనే విషయంపై స్పష్టత లేదు. తెలంగాణ ఆర్టీసీ కూడా ఇప్పటివరకు దీనిపై అధికారికంగా స్పందించలేదు.