సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు క్యాట్‌లో చుక్కెదురైంది. ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ క్యాట్ కొట్టివేసింది. పీవీ సునీల్ కుమార్ ఇవాళ (జూన్ 30) రిటైర్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను విధుల నుంచి తప్పిస్తూ సోమవారం రిలీవ్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఒక్కరోజైన తనను సస్పెన్షన్ నుంచి రిలీవ్ చేయాలని పీవీ సునీల్ కుమార్ క్యాట్‌ను అభ్యర్థించగా.. క్యాట్ అందుకు నిరాకరించింది.