పిఠాపురం వర్మ తీరుపై చంద్రబాబు అసంతృప్తి.. పల్లాకు కీలక సూచనలు .!

3 months ago 18
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య తలెత్తిన ప్రోటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంగళవారం రోజు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు మధ్య ఫ్లెక్సీ పంచాయితీ తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాసరావుతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు.. వర్మ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని.. వర్మకు సూచనలు చేయాలని పల్లాను ఆదేశించారు.
Read Entire Article