జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడని వేణు స్వామి వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అని ఆయన జోస్యం చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ ముక్కుసూటి వైఖరికి రాజకీయాలు సరిపడవని చెప్పిన వేణు స్వామి.. ఇప్పుడు అదే పవన్‌ను పర్ఫెక్ట్ పొలిటీషియన్ అని అభివర్ణించడం ఆసక్తికరంగా మారింది.