నెల్లూరులో షాకింగ్ ఘటన.. ఫ్రెండ్‌తోనే పురుగుల మందు తాగించిన తోటి విద్యార్థులు

2 hours ago 1
నెల్లూరులోని ఓ పాఠశాలలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సంగం గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, నీరసంతో ఇబ్బంది పడ్డాడు. తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ పరిస్థితి మరింత క్షీణించింది. మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు. అయితే స్కూళ్లో తోటి విద్యార్థులు తనతో పురుగుల మందు తాగించారని ఆ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.
Read Entire Article