నకిలీ జెన్యూనిటీ సర్టిఫికెట్ల కలకలం.. జూనియర్‌ లెక్చరర్ల విద్యార్హతలపై మళ్లీ విచారణ

1 week ago 5
తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న సుమారు 800 మంది జూనియర్‌ లెక్చరర్ల విద్యార్హత సర్టిఫికెట్లను ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ మళ్లీ తనిఖీ చేస్తోంది. ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నుంచి పీజీ చేసిన సుమారు 250 మంది పత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు నిర్ధారణ అయిన 50 మందిని సర్వీసు నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. 2023లో రెగ్యులరైన కాంట్రాక్టు లెక్చరర్ల ధ్రువపత్రాల పరిశీలనను రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నకిలీ పత్రాలు సమర్పించినట్లు తేలితే తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
Read Entire Article