తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. దివంగత నేత సూదిని జైపాల్ రెడ్డి పేరు మీద ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఈ జిల్లాను ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయమై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. మరోవైపు రేవంత్ రెడ్డి భార్య గీతా రెడ్డికి జైపాల్ రెడ్డి పెదనాన్న అవుతారు. దీంతో భార్య కోరిక మేరకు రేవంత్ ఈ జిల్లాను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారనే విమర్శలు మొదలయ్యాయి.