రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. ఒకేసారి 36 మంది డీఎస్పీలను ట్రాన్స్‌ఫర్ చేస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వెయిటింగ్‌లో ఉన్న డీఎస్పీలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. అయితే ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని అందులో పోలీస్ బాస్ తేల్చి చెప్పారు. హైదరాబాద్ నగరంతోపాటు.. ఏసీబీ, సీఐడీ, ఇంటెలిజెన్స్ సహా పలు విభాగాల్లో ఈ కొత్త డీఎస్పీలకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు.