తెలంగాణలో కొత్త డిజిటల్‌ వ్యవస్థ.. మార్కెట్‌ యార్డుల్లో అక్రమాలకు ఏఐతో చెక్‌

1 day ago 4
తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో అక్రమాలను అరికట్టి, పంటల క్రయవిక్రయాల్లో పారదర్శకత పెంచేందుకు ఏఐ ఆధారిత డిజిటల్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతుల వివరాల నమోదు నుంచి పంటల వేలం, విక్రయాల వరకు అన్ని ప్రక్రియలను ఒకే వేదికపైకి తీసుకురావాలని సూచించారు. ఐటీ శాఖ సమన్వయంతో వారం రోజుల్లో టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. కోహెడ సమీకృత పండ్ల మార్కెట్‌ మొదటి దశను వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
Read Entire Article