No Horn Zone In Tirumala: తిరుమలకు వాహనాల్లో వెళ్లేవారికి ముఖ్యమైన గమనిక.. ఇక కొండపై హారన్ మోగించకూడదు. సైలెంట్ తిరుమల ఇనిషియేటివ్ పేరుతో టీటీడీ భక్తుల్ని, వాహనదారుల్ని అప్రమత్తం చేస్తోంది. తిరుమలలో అన్ని వాహనాల డ్రైవర్లు ఈ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. తిరుమలలో బోర్డులు ఏర్పాటు చేసి అందరికి అవగాహన కల్పిస్తున్నారు. తిరుమలలో ఆద్యాత్మిక వాతావరణం ఉండేలా, శబ్ధ కాలుష్యాన్ని నియంత్రించేందుకు పోలీసులు, టీటీడీ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు