జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపే టార్గెట్.. ఈనెల 27 నుంచి ఈటల రాజేందర్ పాదయాత్ర

2 weeks ago 15
జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డును మరో ప్రాంతానికి తరలించాలని డిమాండ్‌ చేస్తూ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ పాదయాత్ర చేపట్టనున్నారు. ఈనెల 23న డంపింగ్‌ యార్డు బాధితులతో.. 25న మేధావులు, పర్యావరణవేత్తలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న దుర్వాసన, గాలి-నీటి కాలుష్యం, చెత్త నిల్వలు, మిథేన్‌ ఉద్గారాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ చెత్త నిర్వహణ కేంద్రాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, ప్రజారోగ్య భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలన్న డిమాండ్‌ ఈ పాదయాత్రతో మరింత బలపడే అవకాశం ఉంది.
Read Entire Article