"చంపితే పోలీస్ స్టేషన్‌లోనే చంపేయండి.. లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతా": ప్రశ్న రావణ్

2 hours ago 2
ప్రభుత్వం తనపై కక్షసాధింపులకు పాల్పడుతోందని యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యల కేసులో ఎలమంచిలి కోర్టు శనివారం ప్రశ్న రావణ్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే కాసేపటికే మరో కేసులో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో విడుదల చేశారు ప్రశ్న రావణ్. వేంపాడు టోల్ గేట్ వద్ద ఐదోసారి తనను అదుపులోకి తీసుకుని నక్కపల్లికి తరలిస్తున్నట్లు చెప్పారు. చంపేయాలనుకుంటే పోలీస్ స్టేషన్‌లోనే తనను చంపేయాలని.. లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేసి తానే చనిపోతానంటూ ప్రశ్న రావణ్ హెచ్చరించారు.
Read Entire Article