గ్లోబల్ మెడికల్ హబ్‌గా మారనున్న హైదరాబాద్‌.. సర్కారు దవాఖానాల్లో విదేశీయులకు వైద్యం

2 hours ago 1
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులైన నిమ్స్, టిమ్స్, గాంధీ, ఉస్మానియాలలో విదేశీ రోగులకు కార్పొరేట్ తరహా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఢిల్లీ, ముంబైల తర్వాత విదేశీయులకు హైదరాబాద్‌ మెడికల్ టూరిజం హబ్‌గా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటులో రూ.7 లక్షలుండే మోకీళ్ల మార్పిడి, బైపాస్ సర్జరీలు నిమ్స్‌లో రూ.2 లక్షలకే లభిస్తున్నాయి. మౌలిక వసతులు మెరుగుపరచి టిమ్స్‌లో ప్రత్యేక ఇంటర్నేషనల్ బ్లాక్‌ను, ఇతర ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలను విదేశీయుల కోసం కేటాయించనున్నారు.
Read Entire Article