కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయిన గాంధీభవన్‌లో ఆ పార్టీ నేతల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ఫిరోజ్‌ఖాన్‌ను ఉస్మాన్ హజ్రీ చెంపపై కొట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ఆ సమయంలో పలువురు మంత్రులు అక్కడే ఉండటం గమనార్హం. అడ్డుకోబోయిన వీహెచ్‌ను పక్కకు తోసేయడంతో మిగిలిన కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనిపై ఫిరోజ్‌ఖాన్ స్పందించి.. ఇది ఫ్యామిలీ గొడవ అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.