కల్లు తాగుదామని వెళ్తే కాటికి పంపేశారు.. ఏమేం కలుపుతున్నారో చూశారా..!

1 year ago 23
కల్తీ కల్లు ప్రాణాలు తీస్తుందని తెలిసినా.. చాలా మంది దానికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తక్కువ ధరకే దొరుకుతుండటంతో కల్లు కాంపౌండ్‌లలోకి వెళ్లి ఆ కల్తీ కల్లు, రసాయనాలు కలిపిన కల్లు తాగి.. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడూ కల్తీ కల్లు తాగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నా.. పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. సహజంగా చెట్ల నుంచి వచ్చే కల్లులో రసాయనాలు, నీళ్లు, ఇతర పదార్థాలు కలిపి భారీ మొత్తంలో తయారు చేసి కల్లు కాంపౌండ్‌లలో విక్రయిస్తున్నారు. ఈ కల్లు తాగడం వల్ల అవయవాలు పనిచేయకపోవడమే కాకుండా.. ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగుచూస్తుండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
Read Entire Article