Chandrababu Orders On Tobacco Procurement In AP: రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. సచివాలయంలో పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత స్థితిపై అధికారులు, ట్రేడర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్నాటకలో తలెత్తని సమస్య ఏపీలో ఎందుకు ఉత్పన్నం అవుతోందని ప్రశ్నించారు. టొబాకో బోర్డు పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.