AP MPTC ZPTC Polling Asper Schedule On November 5: పీలో యథావిధిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక సమీక్ష నిర్వహించింది. మురసు తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణపై కలెక్టర్లతో చర్చించారు. ఈ మేరకు గురువారం పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.