Andhra Pradesh Weather Today: ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఏపీ మీదుగా చురుగ్గా కదులడంతో పాటుగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి కారణంగా వానలు కురుస్తాయంటున్నారు. వర్షాలతో పాటుగా ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. విజయవాడలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.