Madugula Janasena Party Incharge Rayapureddy Krishna Resign: అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాయపురెడ్డి కష్ణ రాజీనామా చేశారు. గత కొన్నేళ్లుగా జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డానని.. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నాలుగు మండలాల్లో పార్టీని బలోపేతం చేశానన్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఏడు రోజుల పాటు జైలులో కూడా ఉన్నానన్నారు. అయితే తాను సమన్వయకర్త పదవికి రాజీనామా చేశానని.. పార్టీలో మాత్రం సాధారణ కార్యకర్తలా కొనసాగుతానన్నారు.