ఉపరితల ఆవర్తన ప్రభావం.. తెలంగాణలో 6 రోజుల పాటు వర్షాలు

1 month ago 7
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నేటి నుంచి ఈనెల 27 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి, రాయలసీమ పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయన్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని 102 మండలాల్లో వడగాలుల తీవ్రత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Entire Article