ఈ రూట్‌లో వెళ్తున్నారా? గంజాయి చెకింగ్ అంటూ బండి ఆపి డబ్బులు కొట్టేస్తున్నారు.. బీ అలెర్ట్!

2 weeks ago 7
బైక్‌పై వెళ్తున్న వారే ఆ ఇద్దరి టార్గెట్. రద్దీ ఎక్కువ లేని ప్రాంతంలో రుబాబుగా 'ఏయ్ బైక్ ఆపమని చెప్పి, నీ దగ్గర గంజాయ్ చెక్ చేయాలి' అంటారు. చెక్ చేసే సమయంలో జేబులో ఎంత డబ్బు ఉందో తీసుకుని.. చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్లీ జేబులోనే పెడుతున్నట్లు నటించి కొట్టేస్తారు. అంతేకాదండోయ్ బైక్‌కు బోల్ట్‌లు ఊడతన్నాయి, గాలి తగ్గింది అనే మాటలు కూడా చెప్పి క్షణాల్లో ఫోన్‌లు తీసుకుని పరారవుతున్నారు. తెనాలి - మంగళగిరి రోడ్డులో దుగ్గిరాల ప్రాంతంలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రూట్‌లో వెళ్లే వాళ్లు జర జాగ్రత్తగా ఉండండి.
Read Entire Article