ఇయర్‌ఫోన్లతో నిర్లక్ష్యం వద్దు.. ప్రాణాలకే ప్రమాదం.. సీపీ సజ్జనార్‌ తీవ్ర హెచ్చరిక

1 week ago 8
ఇయర్‌ఫోన్‌ పెట్టుకుని రైల్వే ట్రాక్‌ పక్కన నడుస్తున్న వ్యక్తిని రైలు ఢీకొట్టిన ఘటన వేళ సీపీ సజ్జనార్‌ ప్రజలను అప్రమత్తం చేశారు. ఇయర్‌ఫోన్లతో పాటలు వినడం, ఫోన్‌లో మాట్లాడటంలో పూర్తిగా నిమగ్నమైతే పరిసరాల్లోని ప్రమాదాలను గుర్తించలేకపోవచ్చని హెచ్చరించారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌ల సమీపంలో, రోడ్లపై నడుస్తున్నప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. క్షణిక నిర్లక్ష్యం వ్యక్తిగత ప్రాణాలకే కాకుండా ఇతరుల భద్రతకు కూడా ముప్పు కలిగించవచ్చని గుర్తుచేశారు. ఫోన్‌ కాల్స్‌, వినోదం కంటే ప్రాణాల భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని యువతకు విజ్ఞప్తి చేశారు.
Read Entire Article