ఇది కక్ష సాధింపా? నిరంకుశత్వమా? లేక బరితెగింపా?.. చంద్రబాబుకు జనసేన నేత ప్రశ్నలు

3 months ago 21
శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త శివకుమార్ ఇల్లు కూల్చివేత వ్యవహారంపై జనసేన నేత కోట వినుత మండిపడ్డారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కావాలనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తెల్లవారుజామున పోలీసులను, అధికారులను పంపి ఇల్లు కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చని.. ఇదేం రాజ్యమంటూ ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలపై జరుగుతున్న ఘటనలు.. కక్ష సాధింపా, నిరంకుశత్వమా అంటూ సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు కోట వినుత.
Read Entire Article