Telangana Rakshana Sena Write Letter To Ec: కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ రక్షణ సేన లేఖ రాసింది.. పార్టీకి గుర్తింపు ఇవ్వాలని కోరింది. తమ పార్టీ రిజిస్ట్రేషన్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన అభ్యంతరాల గురించి ప్రస్తావించింది. ఆ అభ్యంతరాలను తమకు పంపాలని లేఖలో కోరారు. తమకు అభ్యంతరాల కాపీలు ఇవ్వకుండా సమాధానం ఎలా చెబుతామని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ముందు తమకు కేటాయించిన పేరుతోనే 105 నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేశామని.. ఇప్పుడు పేరు మార్చమంటే సరికాదు, అన్నాయం అన్నారు.