Andhra Pradesh Rains Alert Today: ఏపీలో కొద్దిరోజులుగా విభిన్న వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రంలో ఓవైపు వర్షాలు కొనసాగుతున్నాయి.. అలాగే ఎండల తీవ్రత కూడా ఉంది. ఏపీలో ఇవాళ కూడా మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం రోజు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి.. కొన్ని చోట్ల మాత్రం ఎండల తీవ్రత కొనసాగింది. రుతుపవనాలు ప్రవేశించినా ఇంకా వర్షాలు మాత్రం ఊపందుకోలేదు.