ఆ ముగ్గుర్నీ గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలే..

11 months ago 20
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులను కాళేశ్వరం, లిక్కర్, విద్యుత్, ఫోన్ ట్యాపింగ్ స్కామ్‌ల ఆరోపణలపై జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. అప్పుడే మరిన్ని అవినీతి విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. బీఆర్ఎస్ మూడు సీట్లకే పరిమితమవుతుందని, హరీష్ రావు తప్ప ఎవరూ గెలవరని ఆయన జోస్యం చెప్పారు. సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడించడం సులభమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అవినీతిపరులను జైలుకు పంపకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. ఈ నెల 29న నిజామాబాద్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారని, అదే రోజు డి. శ్రీనివాస్ విగ్రహావిష్కరణ జరుగుతుందని అరవింద్ తెలిపారు.
Read Entire Article