అల్పపీడన ప్రభావం.. ఈ నెల 30 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో హెచ్చరికలు జారీ..

10 months ago 13
తెలంగాణలో రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి.. సెప్టెంబర్ 26 నాటికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Read Entire Article