అర్నబ్ తుపాను దెబ్బకు విలవిల.. విపత్తు వేళ ఏపీకి తెలంగాణ సాయం, సీఎం రేవంత్ కీలక నిర్ణయం

6 days ago 11
అర్నబ్ తుపాను కారణంగా ఏపీలో విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలకు సిద్ధమైంది. ఏపీ సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో 16 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ విద్యుత్ సిబ్బంది ఏపీకి వెళ్లి దెబ్బతిన్న లైన్లు, స్తంభాల మరమ్మతులు, విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో సహకరించనున్నారు. అదే సమయంలో తెలంగాణలోనూ తుపాను ప్రభావం ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక విద్యుత్ అవసరాలను సమన్వయం చేసుకోనున్నారు.
Read Entire Article