పొద్దున్నే లేచి ఇంటిముందు కళ్లాపి చల్లితే సగం ఆరోగ్యం వస్తుంది కదా మరీ ఆ కళ్లాపి చల్లితే డేంజర్ అంటారేంటి అని అనుకుంటున్నారు కదా. మనం పల్లెటూర్లో ఉంటే చక్కగా ఆవు పేడో, గేదె పేడో తెచ్చుకుని కళ్లాపి చల్లుకుంటాం. పట్టణాల్లో కొందరు నార్మల్ వాటర్‌తోనే చల్లుతారు. ఇటీవల అంతా రెడీమేడే కావడంతో కొందరు ఆ ఫీల్, లుక్ రావడానికి ప్యాకెట్ కళ్లాపి పౌడర్ వాడుతున్నారు. ఇప్పుడు అదే ప్రాణాల మీదకు తెస్తోంది.