Vijay Deverakonda | సొంతూరిని మర్చిపోను..తమ్ముడి పెళ్లి ఇక్కడే

4 months ago 26
పెళ్లి తర్వాత తన భార్య రష్మికతో కలిసి సొంతూరు వెళ్లిన విజయ్ దేవరకొండ అక్కడ భావోద్వేగానికి గురయ్యారు. "నేను ఎక్కడికి వెళ్లినా నా మూలాలను మర్చిపోను.. ఈ ఊరితో నాకు విడదీయలేని బంధం ఉంది" అని గ్రామస్తులతో పంచుకున్నారు. ఊరిలో ఇల్లు కట్టుకోవడం, తన వివాహం ఒకేసారి జరగడం సంతోషంగా ఉందన్న విజయ్.. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లిని కూడా అందరి సమక్షంలో ఇదే గ్రామంలో చేస్తానని మాటిచ్చారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ స్కూళ్లలో చదివే 9, 10 తరగతుల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు.
Read Entire Article