Telangana Weather: తెలంగాణలో కుండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

1 month ago 17
తెలంగాణలో మరోసారి చురుకైన ఉరుములతో కూడిన వర్షాలు మెుదలయ్యాయి. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు నుంచి మరిన్ని జిల్లాలకు వర్షాలు విస్తరించవచ్చునని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్‌ 23–25 మధ్య అల్పపీడనం ప్రభావంతో ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Entire Article