Telangana Weather Today: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. ఆరు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక

1 month ago 12
Telangana Heavy Rainfall: ఉత్తరాంధ్ర తీరానికి సమీపిస్తున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో సెప్టెంబర్‌ 24, 25 తేదీల్లో తెలంగాణలో వర్షాల తీవ్రత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అక్కడక్కడా 200 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందన్నారు. ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షాలు, హైదరాబాద్‌లోనూ 20–40 మిల్లీమీటర్ల వరకు వర్షం పడవచ్చునని అంచనా. సెప్టెంబర్‌ 25 తర్వాత వర్షాలు తగ్గి అక్టోబర్‌ మొదటి వారం వరకు బ్రేక్‌ మాన్సూన్‌ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు.
Read Entire Article