Telangana Weather Forecast: తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. రానున్న 5 రోజులు మార్చి తరహా ఎండలు

1 month ago 9
Telangana Temperature: తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతూ మార్చి తరహా ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. తూర్పు, దక్షిణ తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటే అవకాశాలు ఉండగా.. హైదరాబాద్ సహా మిగిలిన ప్రాంతాల్లో 35–36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరవచ్చునని చెప్పారు. అక్టోబర్ 2 తర్వాత దక్షిణ, ఆగ్నేయ తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నా అవి విస్తృతంగా ఉండకపోవచ్చునని చెప్పారు. నైరుతి రుతుపవనాల ముగింపు దశలోకి ప్రవేశించడంతో తెలంగాణలో వర్షాల కంటే ఎండల ప్రభావం ఎక్కువగా కనిపించే పరిస్థితి ఏర్పడుతోందని వెల్లడించారు.
Read Entire Article