School Holidays: కొమురం భీం వర్ధంతి..రేపు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన

1 week ago 14
కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని అక్టోబర్ 26న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. రెసిడెన్షియల్ పాఠశాలలకు ఈ సెలవు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. సెలవుకు బదులుగా నవంబర్ 14ను పని దినంగా పరిగణించాలని సూచించారు. ఆదివాసీల హక్కుల కోసం జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరాడిన కొమురం భీం, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి అమరుడయ్యారు. ఆయన సేవలకు గుర్తింపుగా తెలంగాణలోని ఒక జిల్లాకు కొమురం భీం ఆసిఫాబాద్ అని పేరు పెట్టారు.
Read Entire Article